రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు(Rains) పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 7వ తేదీ వరకు పలు జిల్లాల్లో వానలు పడతాయని స్పష్టం చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్(Warangal), యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
7వ తేదీ సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. 8వ తేదీ పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉండగా, 9వ తేదీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు వివరించారు.

రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు
ఈనెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘మోచా’ తుఫాన్( Mocha Strom) ఏర్పడే అవకాశముందని, వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మోచా తుఫాన్ ముప్పుతో తెలంగాణ(Telangana)తో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odissa) రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని పేర్కొన్నారు.
For More Articles : CLICKHERE