దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు జరుగుతుందా? జరిగితే ఎప్పుడు? అన్న ప్రశ్నలు కొందరు లేవనెత్తుతుంటే.. మరోవైపు తనపై సందేహాల్నివ్యక్తం చేసే వేళ.. ఈ కేసులో అప్రూవర్ గామారిన దస్తగిరి వాంగ్మూలాన్ని తప్పించి మరే ఇతర వివరాల్ని సేకరించరా? అంటూ ఎంపీ అవినాశ్ అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇప్పటికే పలుమార్లు సీబీఐ మీద ఎంపీ అవినాశ్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో సీబీఐ తన విచారణ పంథాను మార్చినట్లుగా చెప్పాలి.
ఇందులో భాగంగా తాజా విచారణ సాగినట్లుగా చెబుతున్నారు. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఉద్దేశపూర్వకంగా ఆయన కుమార్తె.. అల్లుడు దాచేసినా పట్టించుకోలేదన్న ఆరోపణల మీదా సీబీఐ ఫోకస్ చేసింది.
తాజాగా వివేకా పీఏ క్రిష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ.. ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. హత్య జరిగిన చోట లభించిన లేఖను (వివేకా రాసినట్లుగా భావిస్తున్నారు) ఎందుకు దాచినట్లు? అన్న అంశంపై సీబీఐ అధికారులు పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధించినట్లుగా చెబుతున్నారు. వివేకాపై దాడి జరగటానికి ముందు ఆ లేఖను రాసినట్లుగా చెబుతున్నారు. ఈ లేఖ ముందుగా క్రిష్ణారెడ్డి చేతికే దొరికినట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఈ లేఖను పోలీసులకు ఇవ్వకపోవటం.. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి దాన్ని దాచి ఉంచాలని చెప్పారంటూ క్రిష్ణారెడ్డి చెప్పిన ఉదంతం ఇప్పుడు కేసుకు కీలకంగా మారింది.
ఈ అంశాన్ని ఎంపీ అవినాశ్ పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో.. సీబీఐ ఇప్పుడు ఈ అంశాన్ని ఫోకస్ చేసి.. దానికి సంబంధించిన వివరాలను క్రిష్ణారెడ్డి నుంచి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఎంపీ అవినాశ్ డిమాండ్ పై సీబీఐ ఫోకస్ చేయటం ద్వారా.. తన మీద వస్తున్న విమర్శల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి.
For more articles : CLICKHERE